NTV Telugu Site icon

Swayambhu : నిఖిల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ వైరల్..

Combined (1)

Combined (1)

Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Read Also :Gangs Of Godavari : ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేసిన విశ్వక్ సేన్ మూవీ..

ఈ సినిమాకోసం హీరో నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ ,గుర్రపు స్వారీ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే నేడు నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ నిఖిల్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ మూవీ నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో ఓ యోధుడిగా నిఖిల్ కనిపిస్తున్నాడు.ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది .త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు..

Show comments