Site icon NTV Telugu

Nikhil : నిఖిల్ ‘స్వయంభు’.. భారీ ధరకు సీడెడ్ రైట్స్.. డీల్ క్లోజ్

Swayambhu

Swayambhu

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు. ‘ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, సినిమా బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, రాయలసీమ (సీడెడ్) ప్రాంతానికి సంబంధించిన పంపిణీ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి.

Also Read : Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను ప్రకటించిన మేకర్స్

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాయుడు ఈ సినిమా సీడెడ్ హక్కులను సుమారు 7.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. నిఖిల్ గత చిత్రాల మార్కెట్ తో పోలిస్తే, కేవలం ఒక్క సీడెడ్ ఏరియాలోనే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ‘కార్తికేయ 2’ సాధించిన అంతర్జాతీయ విజయం తర్వాత నిఖిల్ సినిమాలకు పెరిగిన డిమాండ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచాయి. ఈ వారంలోనే ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉండటంతో, ‘స్వయంభూ’ చిత్రం విడుదల ముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. మార్చి 15న ఫస్ట్ కాపీ సిద్ధమైన తర్వాత చిత్ర యూనిట్ గ్రాండ్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించనుంది.

Exit mobile version