యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు. ‘ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, సినిమా బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, రాయలసీమ (సీడెడ్) ప్రాంతానికి సంబంధించిన పంపిణీ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి.
Also Read : Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను ప్రకటించిన మేకర్స్
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాయుడు ఈ సినిమా సీడెడ్ హక్కులను సుమారు 7.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. నిఖిల్ గత చిత్రాల మార్కెట్ తో పోలిస్తే, కేవలం ఒక్క సీడెడ్ ఏరియాలోనే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ‘కార్తికేయ 2’ సాధించిన అంతర్జాతీయ విజయం తర్వాత నిఖిల్ సినిమాలకు పెరిగిన డిమాండ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచాయి. ఈ వారంలోనే ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉండటంతో, ‘స్వయంభూ’ చిత్రం విడుదల ముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. మార్చి 15న ఫస్ట్ కాపీ సిద్ధమైన తర్వాత చిత్ర యూనిట్ గ్రాండ్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించనుంది.