Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలంలో ఈనెల 29న స్వర్ణరథోత్సవం

Srisailam

Srisailam

Srisailam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈనెల 29న బంగారు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. దేవస్థానం వైదిక కమిటీ సూచనతో ప్రతీ మాసంలో శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం నిర్వహిస్తున్నారు. 29న ఆరుద్ర నక్షత్రం రోజే శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహణకు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. 29న మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం మాడవీధులలో స్వర్ణరథంపై స్వామివారు విహరించనున్నారు. బంగారు స్వర్ణరథంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11 కోట్ల స్వర్ణరథాన్ని పోయిన ఫిబ్రవరిలో అప్పటి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవస్థానానికి విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. ఆ స్వర్ణరథంపై ఈనెల 29న స్వామివారు విహరించనున్నారు.

Read Also: AP Cabinet: రేపు ఏపీ ఈ-కేబినెట్ భేటీ.. అంతా ఆన్‌లైన్‌లోనే!

Exit mobile version