Site icon NTV Telugu

Swachhata Hi Sewa: కొనసాగుతున్న స్వచ్ఛతా హి సేవా ప్రచారం..

Swachhata Hi Sewa

Swachhata Hi Sewa

Swachhata Hi Sewa: భారత ప్రభుత్వం 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. నీలం షామీ రావు, ఐఏఎస్, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలంగాణకు మంత్రిత్వ శాఖ నుంచి నోడల్ ఆఫీసర్‌గా నామినేట్ అయ్యారు. ఈ స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగానీలం శమీ రావు, సెంట్రల్ పీఎఫ్‌ కమీషనర్, ప్రాంతీయ కార్యాలయం, బర్కత్‌పురాను సందర్శించారు. అలాగే స్వచ్ఛతా హీ సేవా ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణాన్ని ఆమె పరిశీలించి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు. స్వచ్ఛతా హి సేవా స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని ఆమె సూచించారు. సెంట్రల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ తెలంగాణ వైశాలి దయాల్, అలాగే ప్రాంతీయ పీఎఫ్‌ కమీషనర్‌ డాక్టర్ శివ కుమార్, బర్కత్‌పురా ప్రాంతీయ కార్యాలయ పీఎఫ్‌ కమీషనర్‌ సౌరభ్ జగతి కూడా ఈ సమావేశంల పాల్గొన్నారు. ఇంకా, ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలోని వివిధ శాఖలు, అలాగే సంస్థల స్వచ్ఛతా హి సేవా ప్రచారం నోడల్ అధికారులతో స్వచ్ఛతా హి సేవా ప్రచారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో పలు విషయాల పై అవగాహన కల్పించారు. ఈ సమావేశం అనంతరం నీలం శమీ రావు (ఐఏఎస్‌) స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా పలు కార్యాలయాలను సందర్శించారు.

Read Also:Ragging: గుంటూరు మెడికల్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌..! అధికారుల సీరియస్‌

అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్ కు చిత్రలేఖనం, పలు రకాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు. స్వచ్ఛతా హి సేవా 2023లో ఊహించినట్లుగా 2023 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ‘ఏక్ తారీఖ్- ఏక్ ఘంటా’ పేరు తో 1 అక్టోబర్ 2023న పరిశుభ్రత భారీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలోని నోడల్ అధికారులందరికీ ఫండ్ కమిషనర్ సూచించారు.

Read Also:Eggs: ఈ సమస్యలు ఉన్న వారు కోడిగుడ్లు అస్సలు తినొద్దు

Exit mobile version