NTV Telugu Site icon

Horrific Accident: బైకర్‌ను ఢీకొట్టి.. కారుపై మృతదేహంతో 3కి.మీ లాక్కెళ్లారు..

Horrific Accident

Horrific Accident

Horrific Accident: ఏప్రిల్ 29న రాత్రి ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్- టాల్‌స్టాయ్ మార్గ్ కూడలి వద్ద ఘోరం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌యూవీ ఢీకొట్టింది. కారు బైక్‌ను ఢీకొట్టడంతో ముకుల్ (20) బైక్‌పై నుంచి కింద దూకేశాడు. వీరిని ఢీకొన్న కారు పైకప్పుపై బైక్‌ నడుపుతున్న దీపాంశు వర్మ (30) పడిపోయాడు. అతను కారుపై పడినా కానీ ఎస్‌యూవీ ఆగలేదు. దీపాంశు మృతదేహాన్ని సుమారు 3 కిలోమీటర్ల వరకు అలాగే తీసుకెళ్లింది. మహ్మద్ బిలాల్ అనే ప్రత్యక్ష సాక్షి తన స్కూటర్‌పై కారును వెంబడించి కారు పైకప్పుపై పడి ఉన్న దీపాంశు మృతదేహాన్ని వీడియో తీశాడు. బిలాల్ హారన్ చేస్తూ, కేకలు వేస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినా కారు ఆగలేదు.

Read Also: PT Usha: రెజ్లర్ల నిరసన క్రమశిక్షణారాహిత్యానికి సమానం.. ఆటగాళ్లు వీధుల్లో ఇలా చేయకూడదు..

దాదాపు మూడు కిలోమీటర్ల మేర నాన్‌స్టాప్‌గా వాహనం నడిపిన నిందితులు దీపాంశు మృతదేహాన్ని ఇండియా గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ప్రమాదంలో దీపాన్షు వర్మ మృతి చెందగా, అతని బంధువు ముకుల్ తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, హర్నీత్ స్ంగ్ చావ్లా అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. అతనితో పాటు అతని కుటుంబం కూడా కారులో ఉంది. దీపాంశు వర్మ ఒక జ్యువెలరీ షాప్ నడుపుతూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కొడుకు. దీపాంశు మృతితో ఆయన తల్లిదండ్రులు, సోదరి శోకసంద్రంలో మునిగి పోయారు. అజాగ్రత్త, ర్యాష్ డ్రైవింగ్ వల్ల మరణానికి కారణమైన సెక్షన్ కింద బరాఖంబా రోడ్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 20 ఏళ్ల అంజలి సింగ్ అనే మహిళను కారు ఢీకొట్టి, సుల్తాన్‌పురి నుంచి కంఝవాలా వరకు 10 నుండి 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లి చంపిన నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది.