NTV Telugu Site icon

CM Jagan London Tour: లండన్ పర్యటకు సీఎం జగన్‌.. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్..!

Cm Jagan

Cm Jagan

CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్‌) నుంచి బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్టు తదితర వైసీపీ నేతలు సెండాఫ్ ఇచ్చారు. ఈ నెల 31వ తేదీ తిరిగి బెజవాడ చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

Read Also: S. Jaishankar: కిర్గిజిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై దాడులు.. స్పందించిన భారత విదేశాంగ మంత్రి

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు.. లోకేష్ కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.. అయితే, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్ లు ముందుగానే లోకేష్ పెట్టినట్టు గుర్తించారు.. సీఎం జగన్‌ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్ కనపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అయితే, పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గుండె పోటు వచ్చిందని లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తుండగా.. ఆ వెంటనే లోకేష్‌ను ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు.. అయితే, సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు లోకేష్‌కి సంబంధం ఏంటి? ఆ సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు..? లోకేష్‌.. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు..? తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు పోలీసులు.

Show comments