NTV Telugu Site icon

Hyderabad: కొంపల్లి శ్రీ చైతన్య హాస్టల్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి..

New Project (5)

New Project (5)

కొంపల్లి లోని శ్రీ చైతన్య స్కూల్ అండ్ హాస్టల్స్ లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హాస్టల్ 7 వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి నిన్ననే హాస్టల్లో చేరాడు. ఈరోజు ఉదయం శవమైకనిపించాడు. నిన్న రాత్రి భోజనం చేసి నిద్ర పోయిన విద్యార్థి.. ఉదయం నిద్ర లేకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హాస్టల్ వార్డన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.

READ MORE: Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం..యువతి ప్రేమను నిరాకరించడంతో ఆర్మీ జవాన్ ఆత్మహత్య

విద్యార్థికి హార్ట్ ఎటాక్ వచ్చిందని స్కూలు సిబ్బంది అంటున్నారు. మృతుడు మెదక్ జిల్లా చిలువేరు గ్రామానికి చెందిన మల్లికార్జున్ గా పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం యాజమాన్యం స్కూల్ మెయిన్ గేటుకు తాళం వేసింది. యాజమాన్య వైఖరిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నాయి. పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు యత్నిస్తున్నట్లు సమాచారం.

Show comments