తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేడు (సోమవారం డిసెంబర్ 22న) అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మం) చింతల్ ఠాణ గ్రామ సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మృతి చెందిన వ్యక్తి సర్పంచ్ గా విజయం సాధించడంతో గ్రామస్తులు అయోమయంలో పడిపోయారు. పంచాయితీ ఎన్నికల్లో గ్రామ సర్పంచుగా చనిపోయిన వ్యక్తి చెర్ల మురళి గెలుపొందారు.
Also Read:Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఈరోజే ఆన్లైన్లో టికెట్లు విడుదల
గెలిచిన అభ్యర్ధి భౌతికంగా లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫలితాలు వెల్లడించిన రోజునే నివేదిక పంపించారు అధికారులు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. చింతల్ ఠాణాలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఉప సర్పంచికి తాత్కాలికంగా సర్పంచి బాధ్యతలు అప్పగిస్తారా?.. లేక తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో గ్రామస్తులు ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారుల నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గ్రామస్తులు.
