Rebel MLAs Disqualification: రెబల్ ఎమ్మెల్యే విచారణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.. ఈ రోజు విచారణకు రావడం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు మరో రెండు వారాల సమయం ఇవ్వాలని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై కూడా ఉత్కంఠ నెలకొంది.
Read Also: Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని నిరాకరించిన గవర్నర్
మొత్తంగా రాజ్యసభ ఎన్నికల వేళ రెబల్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఉత్కంఠ కలిగిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలపై వేటు..! అనర్హత పిటిషన్లకు రాజ్యసభ ఎన్నికలకు ముడిపడిఉండడంతో.. అంతా ఏమవుతుందా? అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అసలు స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోన్న నేపథ్యంలో.. ఈ రోజు మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఉదయం పూట విచారణకు హాజరుకావాలని.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం విచారణకు రావాలని సూచించారు. కానీ, ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీనిదేవి.. తాము వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు హాజరుకావడంలేదని.. తాము విచారణకు హాజరుకావాలంటే మరో రెండు వారాల గడువు ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌కు లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. అయితే, నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈ రోజు స్పీకర్ విచారణకు హాజరవుతారా? లేదా వారు కూడా డుమ్మకొడతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే మూడు సార్లు విచారణకు పిలిచిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. మరోసారి అవకాశం ఇస్తారా? లేదా రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు దిగనున్నారు..? ఎలాంటి చర్యలు ఉంటాయి? అనేది ఆసక్తికరంగా మారిపోయింది.