సంచలనం రేపిన కూకట్‌పల్లి మైనర్ బాలిక మర్డర్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. మర్డర్ జరిగి 24 గంటలు గడిచినా.. ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. ఐతే ఈ కేసులో కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అంతే కాదు మర్డర్ జరిగిన ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. అసలు సహస్రాణిని హత్య చేసిందెవరు? ఎందుకు బాలికను చంపేశారు? ఏ కారణంతో హత్యకు పాల్పడ్డారు? అనే విషయాలు తేలాల్సి ఉంది.
Also Read:Arjun Chakravarthy : నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య కథే ‘అర్జున్ చక్రవర్తి’
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సంగీత్ నగర్‌లో పట్ట పగలే మైనర్ బాలిక హత్య జరగడంతో అంతా ఉలిక్కి పడ్డారు. గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని కత్తులతో పొడిచి చంపేశారు. పైగా ఇంటి బయట నుంచి గడియ పెట్టి వెళ్లిపోయారు. తండ్రి వచ్చి చూసే సరికి చిన్నారి సహస్రాణి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు… సహస్రాణి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఐతే సహస్రాణి మర్డర్ జరిగి… ఇప్పటికి 24 గంటలు పూర్తయింది. కానీ మర్డర్ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. మొత్తంగా 5 బృందాలతో వేట ప్రారంభించారు. అంతే కాదు మర్డర్ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కానీ.. సీసీ కెమెరాల్లో ఎక్కడ కూడా కొత్త వారు వచ్చినట్లు, వెళ్లినట్లు దాఖలాలు కనిపించలేదు. దీంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. ఐతే బిల్డింగ్‌లో ఉన్న వారే ఎవరైనా హత్యకు పాల్పడి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సహస్రాణి శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read:JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..
ఇక సహస్రాణి మృతదేహానికి ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ కూతురును ఎవరు? ఎందుకు? చంపారన్న విషయం తెలియకపోవడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ కూతురు ఏం పాపం చేసిందని అంత దారుణంగా హత్య చేశారంటూ విలపిస్తున్నారు పేరెంట్స్. మరోవైపు సహస్రాణి కుటుంబం నివాసం ఉంటున్న ఆ బిల్డింగ్‌లోకి కొత్త వారి ఎంట్రీ లేకపోవడంతో ఆ బిల్డింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. హత్య జరిగిన ఇంటిలో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. స్థానికులను కూడా లోతుగా ప్రశ్నించారు. ఇక ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, బ్లాక్ మ్యాజిక్, కుటుంబ తగాదాలు ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
