IPL 2025: హర్భజన్ సింగ్‌ను సస్పెండ్ చేయండి!
- రాజస్థాన్ 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి
- 19 ఎకానమీతో రన్స్ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్
- వివాదానికి దారితీసిన హర్భజన్ సింగ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 44 పరుగుల తేడాతో ఓడింది. రాయల్స్ ఓటమికి బౌలర్లే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి బౌలర్ కూడా 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అయితే ఏకంగా 19 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. తన 4 ఓవర్ల కోటాలో 76 రన్స్ ఇచ్చిన ఆర్చర్.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేయగా.. హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ వరుసగా బౌండరీలు బాదాడు. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న హర్భజన్ సింగ్.. ఆర్చర్‌ను ఎద్దేవా చేశాడు. ‘లండన్‌లో కాలీ ట్యాక్సీల మీటర్ల మాదిరిగానే ఆర్చర్ మీటర్ ఈ రోజు పరుగెడుతూనే ఉంది’ అని వ్యాఖ్యానించాడు. కాలీ అంటే నలుపు రంగు. దాంతో భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. హర్భజన్ సింగ్ ఇలా మాట్లాడడం దారుణం, ఐపీఎల్ 2025 కామెంట్రీ ప్యానెల్ నుంచి హర్భజన్‌ను సస్పెండ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయాల కారణంగా రెండేళ్లు ఐపీఎల్‌లో ఆడలేదు. భారీ అంచనాలతో ఐపీఎల్ 2025లో అడుగుపెట్టిన ఆర్చర్.. తొలి మ్యాచ్‌లోనే భారీగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ 73 రన్స్ ఇవ్వగా.. ఆర్చర్ 76 పరుగులతో రికార్డు బ్రేక్ చేశాడు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!