NTV Telugu Site icon

Pakistan Citizen: రాజస్థాన్ బార్డర్లో పాకిస్తాన్ పౌరుడు.. పట్టుకున్న పోలీసులు

Rajasthan Border

Rajasthan Border

భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లా బార్మర్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్, పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. అరెస్టయిన వ్యక్తి పాకిస్తానీ పౌరుడని తెలుస్తోంది. అల్సుబా జిల్లాలోని నవతల సరిహద్దు పోస్ట్ ఏరియాలోకి ఆదివారం ఉదయం సరిహద్దు అవతలి నుంచి అనుమానాస్పద వ్యక్తి ఒకరు ప్రవేశించినట్లు చౌతాన్ సర్కిల్ అధికారి కృతికా యాదవ్ తెలిపారు. అతను భారత సరిహద్దులోకి ప్రవేశించడాన్ని చూసి.. సరిహద్దులోని సైనికులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆ వ్యక్తి పట్టించుకోకుండా భారత సరిహద్దులోకి పారిపోయాడు. ఈ క్రమంలో.. స్థానిక గ్రామస్తులు, పోలీసుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. దీంతో సైనికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా.. భద్రతా సంస్థలు నిందితుడిని విచారించే పనిలో నిమగ్నమయ్యారు.

Read Also: Actor Darshan: జైలులో దర్శన్‌కి వీఐపీ ట్రీట్‌మెంట్.. రేణుకాస్వామి తండ్రి ఆవేదన..

సరిహద్దు ప్రాంతంలో అనుమానితుడు పట్టుబడ్డాడని ధృవీకరిస్తూ.. సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తిని పట్టుకున్న తర్వాత భద్రతా సంస్థలు స్వయంగా సంఘటనా స్థలానికి వెళుతున్నాయని కృతిక యాదవ్ తెలిపారు. అరెస్టయిన నిందితుడు ఎవరు.. సరిహద్దు దాటి ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవడానికి భద్రతా సంస్థలు విచారిస్తున్నాయని తెలిపారు. అంతే కాకుండా విచారణలో అసలు విషయాలు బయటపడతాయన్నారు. ప్రస్తుతం అరెస్టయిన అనుమానిత పాకిస్థాన్ పౌరుడిని విచారిస్తున్నారని.. విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read Also: Heart Attack: దేవుడా.. గుండెపోటుతో యూకేజీ చదువుతున్న చిన్నారి మృతి