NTV Telugu Site icon

Pushpa 2: పుష్ఫ 2 సినిమాలో ఓ ఊపు ఊపిన పాట.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేదోచ్..

Pushpa2

Pushpa2

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు. ఇక ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటింది. అయినా కూడా ఎక్కడా కూడా కలెక్షన్స్ డ్రాప్ అవకుండా డీసెంట్ గా దూసుకెలుతోంది. వరల్డ్ వైడ్ గా 22 రోజులకు గాను రూ. 1719.5 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏపాటిదో మరోసారి తెలియజేసింది. ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. ఓవర్సీస్ లోను పుష్ప కు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి.

READ MORE: Puri Musings: న్యూయర్ వేళ.. “భక్తుడు-దేవుడు” ఆసక్తికర కథ చెప్పిన పూరి జగన్నాథ్..

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ‘సూసేకి’ పాట ఓ ఊపు ఊపింది. తాజాగా ఈ పాట యొక్క ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ జోడించాడు. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్‌ అద్భుతంగా పాడాడు. సినిమాలో జాతర సన్నివేశం తర్వాత వచ్చిన ఈ పాట థియేటర్‌లోనూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

READ MORE: Joe Biden: మన్మోహన్ సింగ్‌కి నివాళి అర్పించిన అమెరికా అధ్యక్షుడు..

ఇదిలా ఉండగా.. పుష్ఫ 2 సినిమా నేపాల్ లో కూడా దూసుకుపోయింది. గురువారం (డిసెంబర్ 24) నాటికి 25Cr NPR( భారత కరెన్సీలో 15.7 కోట్లు) వసూలు చేసింది. అక్కడ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ భారతీయ చిత్రం నేపాల్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ తేవటం అందరికీ షాక్ కు గురి చేస్తోంది. ఇంతకు ముందు కేజీఎఫ్ 2 చిత్రం అక్కడ 20Cr NPR కలెక్ట్ చేసింది. దీనిపై సుకుమార్ కూడా తాజాగా స్పందించారు. ఈ సినిమాకు ఇంత క్రేజ్ వస్తుందని తాను ఊహించలేదని వెల్లడించారు.

 

Show comments