Site icon NTV Telugu

Suryakumar Yadav: సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా జర్మనీ లోని మ్యూనిచ్ నగరంలో తన కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని సూర్యకుమార్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ పోస్ట్ లో కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నానని.. సర్జరీ సాఫీగా జరిగిందని, త్వరగా కోలుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అలాగే తిరిగి మైదానంలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చాడు.

Read Also:Prithvi Shaw: వారి వల్లే నా కెరియర్ దెబ్బ తినింది.. పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు.!

ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్‌ లో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ఆగస్టు 4 వరకు సాగనుంది. సూర్యకు విశ్రాంతి కావాల్సిన అవసరం ఉండటంతో, తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకునేందుకు ఈ సమయం (దాదాపు 40 రోజుల సమయం) ఉండడంతో ఈ సర్జరీ చేయించుకున్నాడు. ఆగస్టు 26న మొదలయ్యే బంగ్లాదేశ్ టూర్‌ లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి టీ20 జట్టుకు కెప్టెన్‌గా మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. ఆ సిరీస్‌లో 3 వన్డేలు, 3 టీ20లు జరగనున్నాయి. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఆయన వన్డేల్లో ఆడలేదు.

Read Also:Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ మంచి ప్రదర్శన కనపరిచాడు. ఐపీఎల్ సీజన్ లో 717 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగుల రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ లో వరుసగా 16 ఇన్నింగ్స్‌ల్లో 25 పైగా పరుగులు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను ప్లేఆఫ్స్‌ దాకా చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా వంటి సీనియర్లు టీ20 ఫార్మాట్‌ కు గుడ్‌బై చెప్పగా.. సూర్యకుమార్‌ కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. అప్పటి నుండి ఆయన నాయకత్వంలో జట్టు కొత్తగా, బలంగా కనపడుతోంది.

Exit mobile version