సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త అని సూర్య చెప్పుకొచ్చాడు.
Also Read: 6 వేలకే OnePlus 13R 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇలాంటి డీల్స్ మళ్లీ మళ్లీ రావు!
బుధవారం ఆస్ట్రేలియా, భారత్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించే ప్రెస్‌మీట్‌లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ హెల్త్ అప్‌డేట్ గురించి స్పందించాడు. ‘శ్రేయస్ గాయపడ్డాడని తెలియగానే ఫోన్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయలేదు. అతడి దగ్గర ఫోన్ లేదని తెలిసింది. ఫిజియోకు కాల్ చేశాను. శ్రేయస్ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పాడు. రెండు రోజులుగా నేను శ్రేయస్‌తో మాట్లాడుతున్నా. ఫోన్‌లో నాకు రెస్పాన్స్ ఇస్తున్నాడు. శ్రేయస్ రిప్లై ఇస్తున్నాడంటే.. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పొచ్చు. వైద్యులు అతన్ని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంటాడు. శ్రేయస్ కోలుకుంటుండడం శుభవార్త’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
