Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టు నుంచి డ్రాప్ అయిన తర్వాత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న లోకల్ టోర్నమెంట్లో ఆడుతున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) రంజీ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంతో, ఆయన తన ఫామ్‌ను నిరూపించుకునేందుకు ఎంసీఏ ప్రెసిడెంట్ కప్ ‘ఎ’ అండ్ ‘బి’ డివిజన్ మ్యాచ్‌లను ఆశ్రయించారు. ఈ టోర్నమెంట్లో భాగంగా తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ, రెండో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
దాదర్ యూనియన్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్.. ఎంఐజీ క్రికెట్ క్లబ్ తరఫున కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 అద్భుతమైన సిక్సర్లతో 38 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ముస్లిం యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో 10 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు మాత్రమే చేయగలిగారు.
Also Read
- CM Devendra Fadnavis: "నిందితులను వదిలిపెట్టం".. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
- Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపినప్పటికీ, ఆ టోర్నీలో స్వయంగా ఆయన బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయారు. 2025 ఏడాది అంతటా కూడా ఆయన ప్రదర్శన నిలకడలేకుండా సాగింది. దీంతో సెలెక్టర్లు ఆయనను టీ20 జట్టు నుంచి తప్పించడమే కాకుండా, కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తొలగించారు. ప్రస్తుతం టీమిండియా టీ20 పగ్గాలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు. ఇప్పటికే టెస్టు, వన్డే జట్లకు దూరంగా ఉన్న సూర్య, కేవలం పొట్టి ఫార్మాట్లోనే కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఫార్మాట్ నుంచి కూడా ఉద్వాసనకు గురికావడంతో, మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడానికి ఈ లోకల్ టోర్నీల ద్వారా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
-
CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
-
Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
-
Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
-
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!