Site icon NTV Telugu

Suryakumar Yadav: 15 ఏళ్ల రికార్డు బద్దలు.. క్రికెట్ గాడ్ రికార్డుకు చెక్‌మేట్ చెప్పిన సూరీడు..!

Suryakumar Yadav Sky

Suryakumar Yadav Sky

Suryakumar Yadav: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు చేసిన సూర్య, ముంబై ఇండియన్స్ తరఫున ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు అతను చేసిన పరుగులు 628 కాగా.. ఇందులో భాగంగానే, సచిన్ టెండూల్కర్ 2010లో నెలకొల్పిన 618 పరుగుల రికార్డును అధిగమించాడు.

Read Also: IPL 2025 Final: ఫైనల్‌‌లో తలపడేది ఆ రెండు జట్లే.. జ్యోతిష్యం చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్..!

ఇక సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కు చేయగా.. ఇన్నింగ్స్ ఆరంభంలో రయాన్ రికెల్టన్ (27), రోహిత్ శర్మ (24) ఓపెనర్లుగా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో, మిడిల్ ఓవర్‌ లలో పంజాబ్ బౌలర్లు ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్ మొదటి ఓవర్ నుంచే బంతిని స్వింగ్ చేస్తూ రికెల్టన్‌ను ఇబ్బంది పెట్టాడు. అయితే, జేమిసన్ ఓవర్‌లో కొన్ని బౌండరీలు వచ్చినా ఆరో ఓవర్‌లో జాన్సన్ వేసిన బంతికి రికెల్టన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా నెమ్మదిగా ఆడుతూ చివరకు హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతనికి తోడుగా నామన్ ధీర్ విలువైన పరుగులు జోడించాడు.

Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్

ఇలా మొత్తంగా ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 184/7 పరుగులు చేయగలిగింది. మ్యాచ్ ఓడిన సూర్యకుమార్ చేసిన అరుదైన రికార్డు మాత్రం ముంబై అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. 15 ఏళ్ల పాటు నిలిచిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడం అంటే మాములు విషయం కాదుగా.

Exit mobile version