Site icon NTV Telugu

Surya Kumar Yadav: శభాష్.. ఇది కదా దేశభక్తి అంటే.. మ్యాచ్ ఫీజలు మొత్తం?

Suryakumar Yadav

Suryakumar Yadav

Surya Kumar Yadav: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టు తమ తొమ్మిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత జరిగిన ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుక అసాధారణ పరిణామాలతో వార్తల్లో నిలిచింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. దీంతో ట్రోఫీ లేకుండానే ఛాంపియన్లుగా భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

Asia Cup 2025: మ్యాచ్ అనంతరం హైడ్రామా.. ట్రోఫీని తీసుకోని భారత్! సంబరాలు మాత్రం హైలెట్

భారత్ విజయం సాధించిన తర్వాత ట్రోఫీ, మెడల్స్ ప్రదానం చేసే కార్యక్రమం దాదాపు గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. వ్యక్తిగత అవార్డులను ఇతర అతిథుల నుంచి అందుకున్నప్పటికీ, టీమిండియా మాత్రం మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తిరస్కరించింది. దుబాయ్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ, నఖ్వీ అందుకు అంగీకరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ అపూర్వమైన సంఘటన గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

Ind vs Pak : పాక్‌ను చిత్తు చేసిన భారత్‌.. భారత్‌కు తొమ్మిదోసారి ఆసియాకప్‌ ట్రోఫీ

సూర్యకుమార్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి కష్టపడి గెలిచిన జట్టు ట్రోఫీని తిరస్కరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ విజయం మాకు సులువుగా రాలేదు. మేము ఈ టోర్నమెంట్‌లో చాలా కష్టపడ్డాం.. అందుకే మాకు ట్రోఫీ దక్కే అర్హత ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, “అసలైన ట్రోఫీలు నా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. నా 14 మంది సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బందే నా నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణంలో వారే నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారని భావోద్వేగంతో తెలిపారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ టోర్నమెంట్ లో తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనితో క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖులు, నెటిజన్స్ కూడా సూర్య చేసిన పనికి శబాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version