NTV Telugu Site icon

Kanguva : సూర్య “కంగువ” రిలీజ్ డేట్ ఫిక్స్..?

Whatsapp Image 2024 05 19 At 12.50.47 Pm

Whatsapp Image 2024 05 19 At 12.50.47 Pm

Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను సిరుత్తై శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు..యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి.ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సూర్య సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.అలాగే కంగువ స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

ఈ సినిమాలో సూర్య వారియర్‌గా నటిస్తున్నాడు. సూర్య వారియర్ లుక్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. బాబీ డియోల్ గ్లింప్సె కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏకంగా 10 వేల మందితో భారీ యుద్ధానికి సంబంధించిన సీక్వెన్స్ తెరకెక్కించినట్టుగా సమాచారం.ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలువనుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ 1 న కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం.దీనిపై చిత్రయూనిట్ నుంచి  అధికారిక ప్రకటన రావాలి ..

Show comments