Site icon NTV Telugu

Suriya: ఫ్యాన్ పెళ్లికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్‌గా స్టార్ హీరో.. వైరల్‌గా మారిన వీడియో

Suriya

Suriya

Suriya: అభిమాన నటులపై ఫ్యాన్స్‌కు ఎంతటి ప్రేమ ఉంటుందో వర్ణించడం సాధ్యం కాదు. కొంత మంది ఫ్యాన్స్‌‌కు వారి అభిమాన నటుల విషయంలో అభిమానంతో పాటు, ఆరాధన భావం కూడా ఉంటుంది. అచ్చం అలాగే తమను అభిమానించే అభిమానుల విషయంలోను నటులకు అంతే ప్రేమ ఉంటుందని నిరూపించాడు ఒక స్టార్ హీరో. తమ పెళ్లికి రావాలని కోరిన అభిమాని పెళ్లికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరో. అభిమాన హీరో తన పెళ్లికి రావడంతో సంతోషంతో వధువు కళ్లలో ఆనందభాష్పాలు తిరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ ALSO: Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు అభిమానుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో మరోసారి నిరూపించారు. తన డైహార్డ్ ఫ్యాన్ అయిన వధువు పెళ్లికి సప్రైజ్ ఎంట్రీ ఇచ్చి, ఆమెకు లైఫ్ లాంగ్ మెరబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వధువుకు హీరో సూర్య అంటే విపరీతమైన అభిమానం. ఆ ఇష్టాన్ని తెలుసుకున్న వరుడు.. వారి పెళ్లికి సూర్యను ఆహ్వానించాడు. కానీ ఈ విషయం వధువుకు ఏమాత్రం తెలియదు. ఒక్కసారిగా వెడ్డింగ్ హాల్‌లోకి సడన్‌గా తన అభిమాన హీరో సూర్య అడుగుపెట్టగానే.. పెళ్లి కూతురు షాక్ అయ్యింది. నోరు వెళ్లబెట్టి చూస్తూ.. ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. “ఇది నిజమా?” అన్నట్టు రియాక్ట్ అయ్యింది. స్వయంగా సూర్య వేదికపైకి వచ్చి, వధూవరుల చేతులు పట్టుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ ALSO: Mega Victory Mass song: ‘ఏందీ బాసు సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి’.. మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌ చూశారా!

Exit mobile version