Suriya : తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ భామ దిశా పటాని, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. క్రీస్తుశకం 1000 – 1100సంవత్సరాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పిరియాడికల్ మూవీగా కంగువాను దర్శకుడు తెరకెక్కించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా.. మొదటిరోజే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్ లో ది బెస్ట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మాత్రం తేలిపోయిందనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితం దాదాపు 12 నిమిషాల పాటు రన్ టైమ్ ను ట్రిమ్ చేసిన మేకర్స్.. రెండో వారంలో వసూళ్లు పుంజుకుంటాయన్న ఆశతో ఉన్నారు కానీ అలాంటి పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also:Election Results: ఎర్లీ ట్రెండ్స్.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో దూసుకుపోతున్న బీజేపీ..
అయితే కంగువాను ఇప్పటి వరకు ఎవరూ చూడని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం ప్రముఖ టెక్నీషియన్లను రంగంలోకి దింపారు. దీంతో సినిమా షూటింగ్ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు కలిపి రూ.350 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు మేకర్స్ క్రియేట్ చేసిన బజ్ తో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. కానీ వసూళ్లు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో కంగువా.. కోలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ గా మారుతుందన్న ఆశలు గాలిలో కలిసిపోయాయి. సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చడం ఖాయమని తెలుస్తోంది. ఇంకా రూ.100 కోట్ల మార్కును కూడా దాటనట్లు సమాచారం. దీంతో నిర్మాతకు మద్దతుగా సూర్య రంగంలోకి ఇప్పుడు దిగినట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఓ చిన్న సినిమాలో నటించేందుకు సూర్య ఓకే చెప్పారట.
Read Also:Jasprit Bumrah: నా మొగుడు గొప్ప బౌలర్.. సంజనా ఫన్నీ కామెంట్! నవ్వుకోవాల్సిందే
తక్కువ బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించాలని హీరో సూర్య సూచించినట్లు తెలుస్తోంది. దాని ద్వారా కంగువా నష్టాలను కొంత మేర పూడ్చుకోవాలని చెప్పినట్లు టాక్. అదే సమయంలో రెమ్యునరేషన్ కూడా తక్కువ మొత్తంలో తీసుకోనున్నారని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సూర్య తీసుకున్న నిర్ణయం పట్ల అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సూర్య చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజుతో ఓ మూవీ చేస్తున్నారు.