Suriya : ‘కంగువ’ వంటి గొప్ప సినిమాలో నటించడం నా అదృష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కంగువా’. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో సూర్య మేకోవర్ అండ్ గెటప్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో సూర్యతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సూర్య… ‘కంగువ’ లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు..“గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. ‘కంగువ’ విషయంలో కూడా జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. ప్రతి సినిమా స్క్రిప్ట్, మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ, ‘కంగువ’ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాము… ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు అయితే కాదు. ‘కంగువ’కు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాము.. అందుకు డైరెక్టర్ శివకు థ్యాంక్స్. కంగువ లాంటి ప్రెస్టీజియస్ మూవీ చేయాలనుకున్న ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!