మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ “కాథల్ ది కోర్”. మలయాళ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక హీరోయిన్ గా నటించింది. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపెనీ, వేఫరెర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తం గా నిర్మించింది. ఈ మూవీకి మాథ్యూస్ పులికన్ సంగీతం అందించాడు. ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి.కాగా ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా చూసిన సమంత ఈ ఏడాది లో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. తప్పకుండా అందరు కలిసి చూడాల్సిన చిత్రమిది. మమ్ముట్టి సార్ నా అభిమాన హీరో. ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్ నుంచి ఇంకా నేను బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమాలు చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవ్ యూ జ్యోతిక’ అంటూ పోస్ట్ చేసింది.తాజాగా స్టార్ హీరో, జ్యోతిక భర్త సూర్య ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించాడు.అందమైన ఆలోచనలు కలిసి వస్తే మనకు కాథల్ ది కోర్ లాంటి సినిమాలు వస్తాయి. మంచి సినిమా పట్ల మమ్ముట్టి సార్ చూపించే ప్రేమ ఆయనిచ్చే స్ఫూర్తి ఎంతో అద్భుతం. అందమైన సినిమా అందించిన మమ్ముట్టి సార్ టీంకు నా హ్యాట్సాఫ్. నిశ్శబ్ద సన్నివేశాలు కూడా విలువల గురించి మాట్లాడతాయి. మాకు ఈ ప్రపంచాన్ని చూపించిన రైటర్స్ ఆదర్శ్ సుకుమార మరియు పౌల్సన్ స్కేరియాకు అభినందనలు. నా ప్రియమైన జ్యోతిక తన ప్రేమ తో అందరి హృదయాలను గెలుచుకుంది.. అని సూర్య ఇన్‌స్ట్రాగ్రామ్ లో రాసుకొచ్చారు సూర్య.