Riya Shibu : సూర్య-జ్యోతిక నుంచి స్పెషల్ గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న ‘సర్వం మాయ’ నటి రియా!

Suriya Jyothika Gift To Riya Shibu

Suriya Jyothika Gift To Riya Shibu

కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక గురించి తెలిసిందే. మంచి నటులుగానే కాకుండా, తోటి కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా వీరు ఎప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగా తాజాగా ఈ స్టార్ జంట నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నటి రియా షిబు ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.

Also Read : Mammootty: ఆ 4 నెలలు నరకం చూశాను..మమ్ముట్టి ఎమోషనల్!

రియా షిబు నటించిన ‘సర్వం మాయ’ (#SarvamMaya) సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిన సూర్య-జ్యోతిక, ఆమెను అభినందిస్తూ ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపించారు. తన పెర్ఫార్మెన్స్‌ను మెచ్చి ఇంత పెద్ద స్టార్స్ స్వయంగా గిఫ్ట్ పంపడంపై రియా ఎమోషనల్ అయ్యింది. “నేను ఇప్పుడు గాల్లో తేలిపోతున్నాను. నా పనిని గుర్తించి, సమయం కేటాయించి ఈ గిఫ్ట్ పంపినందుకు సూర్య సర్.. జ్యోతిక మ్యాడమ్‌కు చాలా థాంక్స్. ఈ అభినందనను మా ‘సర్వం మాయ’ టీమ్ అందరి తరపున అందుకుంటున్నాను’ అంటూ రియా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచి టాలెంట్‌ను గుర్తించడంలో సూర్య దంపతులు చూపిస్తున్న చొరవను నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.