Site icon NTV Telugu

Kanguva : కంగువ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన సూర్య..

Whatsapp Image 2024 01 10 At 10.05.28 Pm

Whatsapp Image 2024 01 10 At 10.05.28 Pm

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు..స్టార్ డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42 వ సినిమాగా తెరకెక్కుతున్న కంగువ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యం లో వస్తోంది.ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇటీవలే న్యూ ఇయర్ వెకేషన్ పూర్తి చేసిన సూర్య కంగువ షూట్‌పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.తాజాగా సూర్య సినిమా షూటింగ్‌ అప్‌డేట్ ను అందించాడు.

కంగువ కోసం నా చివరి షాట్‌ పూర్తయింది. చిత్రయూనిట్‌ మొత్తం చాలా పాజిటివ్‌ గా ఉంది. ఇది ఒకదానికి ముగింపు.. కానీ చాలా వాటికి ప్రారంభం.. మంచి జ్ఞాపకాలు అందించిన శివ అండ్‌ టీంకు ధన్యవాదాలు. కంగువ నాకు చాలా ప్రత్యేకం. మిమ్మల్ని అందరికీ స్క్రీన్‌పై చూసేందుకు ఎంతో ఎక్జయిటింగ్‌ గా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశాడు. కంగువ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ లో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది.. అలాగే యానిమల్ మూవీతో ఎంతగానో పాపులర్ అయిన బాబీడియోల్ ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కంగువ మూవీ ౩డీ ఫార్మాట్‌ లో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరియు మ్యూజిక్‌ అందిస్తున్నాడు. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌ తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా కంగువ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌ లో సూర్య 43 లో కూడా నటిస్తున్నాడు.

Exit mobile version