NTV Telugu Site icon

Suresh Raina: ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్‌పై సురేష్ రైనా కీలక ప్రకటన!

Suresh Raina

Suresh Raina

Suresh Raina: ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌తో ఎంఎస్ ధోని మరోసారి క్రికెట్ మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగే ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ముందు, భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఎంస్‌ ధోనీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ఆర్సీబీతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2024లో ధోని నుంచి తన అంచనాలను రైనా వ్యక్తం చేశాడు. ఈ సారి జట్టుకు కెప్టెన్‌గా ధోనీ ఉండనందున ఈ సారి దూకుడుగా ఆడగలడని సురేష్ రైనా తన అభిప్రాయాన్ని చెప్పారు. సీఎస్కే ఈ సీజన్‌లో కూడా తన ఛాంపియన్‌షిప్ మనస్తత్వాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నానన్నాడు.

రైనా మాట్లాడుతూ.. ఎంఎస్ ధోని మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడని.. ధోని ఆర్డర్‌లో ఉన్నతంగా బ్యాటింగ్ చేయడాన్ని తాను చూడాలనుకుంటున్నానని తన మనస్సులోని కోరికను బయటపెట్టారు. చివరి రెండు ఓవర్లకే కాదు ఐదు ఓవర్ల పాటు ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌ను చూడాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోందన్నారు. ధోని క్రీజులోకి వచ్చినప్పుడు స్థిరపడటానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత ధోని హెలికాప్టర్ షాట్లను ఆస్వాదించవచ్చని రైనా చెప్పుకొచ్చాడు. ధోనికి ఆపరేషన్‌ జరిగింది.. కెప్టెన్‌గా కూడా లేడు.. కాబట్టి ఇది ధోనికి పెద్ద ఐపీఎల్‌ అవుతుందన్నాడు. సీఎస్కే తన వారసత్వాన్ని మరింత కొనసాగించాలని ఆశిస్తున్నానని చెప్పాడు. రుతురాజ్, శివమ్ దూబే, డారిల్ మిచెల్ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించినప్పుడు ఇది జరుగుతుందని రైనా పేర్కొన్నాడు.

Read Also: IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో సరికొత్త నిబంధనలు..

చెపాక్‌లో సీఎస్కేను ఆర్సీబీ ఓడించగలదా అని అడిగిన ప్రశ్నకు రైనా సమాధానం ఇచ్చాడు. చెపాక్‌లో సీఎస్కే ఆడిన 64 మ్యాచ్‌లలో 45 గెలిచింది. రైనా మాట్లాడుతూ.. సీఎస్కేను ఓడించే జట్టు ఆర్సీబీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు. అదే కాకుండా ఇప్పుడు కెప్టెన్‌ ధోని కాదు.. రుతురాజ్‌ కావడంతో ప్రత్యర్థి జట్టు ధైర్యం కొంచెం పెరుగుతుందని తన మనస్సులోని భావనను తెలిపాడు. విరాట్ కోహ్లీ రెండు నెలల విరామం తర్వాత ఆర్సీబీ కోసం పోటీ క్రికెట్‌కు తిరిగి రానున్నాడు. గత ఐపీఎల్ నుంచి విరాట్‌ కేవలం రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 37 ఏళ్ల ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని భావిస్తున్నట్లు చెప్పాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య ప్రారంభ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Show comments