ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే… కాగా.. గత నెలలోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బయటికొస్తున్నట్లు సూచన ఇచ్చారు. ఈ క్రమంలో.. తాను వేలానికి వెళితే ఎంత మొత్తం వస్తుందని అభిమానులను అడిగాడు పంత్. ఈ క్రమంలో.. రానున్న వేలంలో భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దగా వేలం వేయబోయే ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ కచ్చితంగా ఉంటాడనడంలో సందేహం లేదు. కాగా.. పంత్ తర్వాత ఏ జట్టులో ఆడుతాడో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పాడు. వచ్చే సీజన్‌లో పంత్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడే అవకాశం ఉందని అన్నాడు.
Read Also: US: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
తాను ఇటీవల చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలిశానని, రిషబ్ పంత్ కూడా అక్కడే ఉన్నాడని సురేశ్ రైనా తెలిపాడు. జియో సినిమాతో ఆయన మాట్లాడుతూ.. “నేను ఎంఎస్ ధోనీని ఢిల్లీలో కలిశాను, పంత్ కూడా అక్కడే ఉన్నాడు. ఏదో పెద్ద విషయం జరగబోతోందని నాకు అనిపిస్తుంది. త్వరలో ఎవరో పసుపు జెర్సీని ధరించబోతున్నారు.” అని రైనా అన్నాడు.
Read Also: Pappu Yadav: ఎవరు చంపాలనుకుంటున్నారో.. వచ్చి నన్ను చంపేయండి
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తొమ్మిదేళ్ల పాటు ఢిల్లీకి ఆడాడు. తాజాగా.. జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. పంత్.. తన జట్టు కోసం 111 మ్యాచ్‌లు ఆడాడు. 35.31 సగటుతో.. 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లు: అక్షర్ పటేల్ (రూ. 16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు).