Suresh Raina: సురేశ్ రైనా మెరుపులు.. హైదరాబాద్ విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suresh Raina vintage batting in Legends League Cricket: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా మెరుపులు మెరిపించాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 46 రన్స్ చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రైనా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రైనా సహా గుర్కీరత్ సింగ్, క్రిస్ మోఫు చెలరేగడంతో హైదరాబాద్ జట్టు క్యాపిటల్స్‌పై గెలిచింది. ఈ ఎడిషన్‌లో రైనా నాయకత్వంలోని హైదరాబాద్ వరుసగా రెండో విజయం అందుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గుర్కీరత్ సింగ్ (89; 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. సురేశ్ రైనా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పీటర్ ట్రెగో (36 నాటౌట్; 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డ్వేన్ స్మిత్ (3), మార్టిన్ గప్తిల్ (2), స్టువర్ట్ బిన్నీ (1) నిరాశపరిచారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2 వికెట్లు తీశాడు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Team India Coach: దక్షిణాఫ్రికా పర్యటన.. టీమిండియాకు కొత్త కోచ్!
190 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా క్యాపిటల్స్ 6 వికెట్స్ కోల్పోయి 186 పరుగులు చేసింది. గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడి 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (77; 48 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆష్లే నర్స్ (41 నాటౌట్; 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్‌ను గెలిపించే విఫలయత్నం చేశారు. గౌతమ్ గంభీర్ (0), హషీమ్ ఆమ్లా (5), బెన్ డంక్ (5) విఫలమయ్యారు. అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో క్రిస్ మోఫు 2 వికెట్లు తీశాడు. నేడు మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
Suresh Raina turning his clock with some vintage batting in Legends League Cricket…!!!
– The Mr IPL. 🔥💪pic.twitter.com/CpG5K0DE6o
— Johns. (@CricCrazyJohns) November 23, 2023
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!