NTV Telugu Site icon

Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులో పూజలు నిలిపివేయాలి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

Gyanvapi

Gyanvapi

జ్ఞాన్‌వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. వివాదాస్పద కట్టడం యొక్క దక్షిణ చివరలో ఉన్న వ్యాస్ జీ నేలమాళిగలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ సవాలు చేసింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదుగా పిలవబడే అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది. ఫిబ్రవరి 26వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్‌లో పూజలపై నిషేధం విధించాలని మసీద్ కమిటీ డిమాండ్ చేశారు.

Read Also: Memantha Siddham Bus Yatra: 5వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు ఇలా సాగనున్న జగన్ టూర్‌..

ఇక, జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేసిన కమిటీ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదులోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేయాలనే నిర్ణయాన్ని సవాలు చేసినట్టు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 31వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులో వారణాసి కోర్టు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని వ్యాస్ జీ నేలమాళిగలో ప్రార్థనలు చేయడానికి హిందూ భక్తులకు అనుమతి ఇచ్చింది. అలాగే, తన ముత్తాత సోమనాథ్ వ్యాస్ డిసెంబర్ 1993 వరకు ఈ నేలమాళిగలో పూజలు చేసేవారని కాశీ విశ్వనాథ ఆలయం తరపున నామినేట్ చేయబడిన హిందూ పూజారి, పిటిషనర్ శైలేంద్ర కుమార్ పాఠక్ తెలిపారు. అయితే, 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేలమాళిగలో పూజలను నిలిపివేశారు. అయితే, నేలమాళిగలో ఎప్పుడూ విగ్రహం లేదని ముస్లిం పక్షం ట్రయల్ కోర్టు ముందు పేర్కొంది.