NTV Telugu Site icon

Supreme Court: మహిళా కోస్ట్ గార్డ్ అధికారికి శాశ్వత కమిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Icg

Icg

Indian Coast Guard: కోస్ట్ గార్డ్ కు చెందిన మహిళా అధికారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్‌కు అర్హులైన మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించనుంది. అయితే, గతంలో ఈ విషయంపై మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయనందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇండియన్ కోస్ట్ గార్డ్‌ను మందలించింది. అలాగే, ఈ కోస్ట్ గార్డ్ దళంలో మహిళలకు న్యాయమైన విధానాన్ని అవలంబించాలని పేర్కొంది.

Read Also: US Presidential Elections: అయ్యో పాపం.. సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి

అయితే, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం (ఐసీజీ) నేవీలో ఉండగా మహిళల కోసం ఎందుకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని పిటిషన్‌లో ప్రశ్నించింది. మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం విముఖత చూపడంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.