NTV Telugu Site icon

Same Gender Marriage: నేడే స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!

Supreme Court

Supreme Court

All eyes on Supreme Court verdict on Same Gender Marriage: నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించనుంది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో స్వలింగ సంపర్కుల జంటలు చాలానే ఉన్నాయి. సుప్రియో చక్రవర్తి-అభయ్ డాంగ్, పార్థ్ ఫిరోజ్ మెహ్రోత్రా-ఉదయ్ రాజ్ ఆనంద్.. పలువురు పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని 20కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రత్యేక వివాహ చట్టంలో మతాంతర, కులాంతర వివాహాలకు రక్షణ ఉందని పిటిషన్లలో పేర్కొన్నారు. స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు.

Also Read: Tamil Nadu: తమిళనాడులో దారుణం.. భర్త ప్రాణాలు తీసిన భార్య సీరియల్ పిచ్చి!

పరస్పర అంగీకారంతో ఇద్దరు పెద్దల మధ్య స్వలింగ సంపర్కం నేరమని 2018లో సుప్రీం కోర్టు ప్రకటించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377లోని భాగాన్ని కోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత గే వివాహాలకు చట్టపరమైన హోదా కల్పించాలనే డిమాండ్ వచ్చింది. చివరకు 2022లో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ఈ ఏడాది ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. నేడు తీర్పు వెలువరించనుంది.

Show comments