Site icon NTV Telugu

Supreme Court: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సుప్రీంకోర్టు హెచ్చరిక..!

Supreme Court

Supreme Court

Supreme Court: చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడి, తమ ఉజ్వల భవితకు బాటలు వేసిన తల్లిదండ్రుల విషయంలో కొందరు పిల్లలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జీవితంలో ఎదిగేందుకు అడుగడుగునా అండగా ఉన్న పోషకులను, తాము పోషించలేం అంటూ అనాథలుగా వదిలేస్తున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఆపద వేళ బాధ్యతగా చూసుకోవాల్సిన కుమారులు, తమకు సంబంధం లేదంటూ వారిని పరాయి మనుషులుగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దు కానీ.. వాళ్లు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలని పట్టుబడుతున్నారు. అలాంటి వాళ్లను తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే పిల్లల్ని ఇంటి నుంచి బయటకు తోసేసే హక్కు ఆ పేరెంట్స్‌కి ఉందని చెప్పింది. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007 ఇలాంటి తల్లిదండ్రులకు అండగా ఉంటుందని తెలిపింది.

READ MORE: Shah Rukh Khan: ఆర్యన్ ఖాన్ షోపై ఐఆర్ఎస్ అధికారి ఫైర్.. షారుఖ్-గౌరీ సహా నెట్‌ఫ్లిక్స్‌పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా..

తాజాగా తన కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023లో ఈ వృద్ధ జంట కుమారుడి నుంచి పోషణ ఖర్చులు అందేలా చూడాలని.. అలాగే తమ ఆస్తులు తమకు చెందేలా చూడాలని కోరుతూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. నెలకు రూ.3000తో పాటు ఆ వృద్ధ జంట ఇంటిని ఖాళీ చేయాలని కుమారుడికి తీర్పునిచ్చింది. కుమారుడు ముంబై హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కింది కోర్టు ఆ కుమారుడికి సపోర్టు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ కొడుకు కూడా ఒక సీనియర్ సిటిజన్. అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఆ వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈకేసును విచారించిన కోర్టు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని స్పష్టం చేసింది. ట్రైబ్యూనల్ కోర్టు తీర్పును సమర్థించింది.

Exit mobile version