Site icon NTV Telugu

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

Vote To Note

Vote To Note

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. అయితే, నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ కూడా వేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది.

Read Also: Urvashi Rautela : పింక్ ఫ్రాక్ లో మెరిసిపోతున్న గ్లామర్ బ్యూటీ..

అయితే, 2017లో ఈ పిటిషన్లను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి దాఖలు చేయగా.. నేడు విచారణకు వచ్చింది. అయితే.. అంతకు ముందు రోజే.. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు విచారణ జరుగనుంది. అది జరిగిన తర్వాతి రోజే.. ఓటుకు నోటు కేసు విచారణకు వస్తుండటం సర్వత్రా ఆసక్తికి రేపుతుంది. గతంలో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించటం ఇప్పుడు సంచలనం రేపుతుంది.

Read Also: Producer Anji Reddy : ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి సపోర్ట్ ఇవ్వాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మద్దతును ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడుగుతున్న సమయంలో.. సూట్‌కేసులతో 50 లక్షల రూపాయలు ఇస్తూ కెమెరాకు చిక్కారు. అయితే.. ఆ డబ్బులు ఇచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తూ.. సుప్రీంలో పిల్ దాఖలు చేశారు.

Exit mobile version