NTV Telugu Site icon

NewsClick Editor: న్యూస్ క్లిక్ ఎడిటర్ విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

Newsclick

Newsclick

న్యూస్‌ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ ప్రబీర్ పుర్కాయస్థను తక్షణమే ఇవాళ ( బుధవారం) విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదం ( ఉపా) చ‌ట్టం కింద అత‌న్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు కోర్టు తెలిపింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, సందీప్ మెహ‌తాల‌తో కూడిన ద్విసభ్య ధ‌ర్మాస‌నం విచారణ చేసింది. ఈ కేసులో రిమాండ్ కాపీని ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తెలిపింది. అందుకే ఎడిట‌ర్ అరెస్టును కోర్టు త‌ప్పుబట్టింది. ఎందుకు అరెస్టు చేశార‌న్న అంశానికి సంబంధించిన విష‌యాల‌ను న్యాయస్థానికి వెల్లడించలేదుని.. పంకజ్ బన్సల్ కేసు తరహాలో అతడ్ని కస్టడి నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read Also: KL Rahul: ఈ సీజన్‌లో మాకు అతిపెద్ద సమస్య అదే: కేఎల్ రాహుల్

రిమాండ్ ఆర్డర్ చెల్లదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిన్ మోహతా ఆర్డర్ చెల్లదని వెల్లడించారు. ప్రబీర్ పుర్కాయస్థను గ‌త ఏడాది అక్టోబ‌ర్ 3వ తేదీన ఉపా( UAPA) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. చైనా ఏజెండా గురించి క‌థ‌నాలు ప్రచురిస్తున్న న్యూస్‌ క్లిక్ సంస్థకు అక్రమంగా నిధులు వస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆరోపలు గుప్పించింది. ఆ కేసులో న్యూస్‌ క్లిక్ ఎడిట‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రాగన్ కంట్రీ చైనాకు అనుకూలంగా రాసేందుకు టెర్రర్ ఫండింగ్ జరిగినట్లు 8 వేల ఫేజీల ఛార్జ్ షీట్లో ఢిల్లీ పోలీసులు ఆరోపణలు చేశారు. అలాగే, ఇదే, కేసులో న్యూస్‌క్లిక్ హెచ్ఆర్ అధిప‌తి అమిత్ చక్రవర్తిని కూడా అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు.