Supreme Court: శివసేన వివాదం.. ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తును కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. కానీ, థాక్రే వర్గ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏక్‌నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక పార్టీ పేరు, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని థాక్రే వర్గం సుప్రీంను అభ్యర్థించగా.. అందుకు మాత్రం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.
Read Also: Locked Self: ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలోనే ఉండిపోయిన తల్లీకొడుకులు!
Also Read
ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక.. చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు ఉద్ధవ్ థాక్రే వర్గానికి సూచించింది. శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే పేరుతో పార్టీ పేరును.. వెలుగుతున్న టార్చ్ సింబల్‌ను గుర్తుగా ఉపయోగించుకోవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా పిటిషనర్‌కు సూచించారు. ఠాక్రే వర్గానికి చెందిన చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు ఎలాంటి విప్ జారీ చేయబోమని, ఏ చర్యలు ప్రారంభించబోమని ఏక్‌నాథ్ షిండే వర్గం తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. అనంతరం విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?