NTV Telugu Site icon

Supreme court: యూపీ మదర్సా చట్టం కేసులో కీలక తీర్పు

Supor

Supor

ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. 17 లక్షల మంది విద్యార్థులు, 10 వేల మంది టీచర్లను రాష్ట్ర విద్యావ్యవస్థలో సర్దుబాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. గత మార్చి నెలలో ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చట్టం సెక్యులరిజాన్ని ఉల్లంఘించినట్లు ప్రకటించింది. మదర్సాలో ఉన్నవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వ విద్యావిధానంలో విద్యావసతులు కల్పించాలని హైకోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Hema Malini: బీజేపీ మధుర అభ్యర్థి హేమమాలిని ఆస్తులెంతో తెలుసా..?

మదర్సా చట్టంలోని నిబంధనలను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని, మతపరమైన బోధనకు అవకాశం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. మదర్సా బోర్డు లక్ష్యం, ఉద్దేశ్యం లౌకిక వాదానికి విఘాతం కలిగిస్తుందని.. బోర్డు ఏర్పాటు ప్రాథమికంగా సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి, యోగి ప్రభుత్వానికి నోటీసులు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంతో 17 లక్షల మంది విద్యార్థులు, 10,000 మంది టీచర్లకు ఊరట లభించింది.

ఇది కూడా చదవండి: The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ని టెలికాస్ట్ చేయొద్దు.. దూరదర్శన్‌ని కోరిన కేరళ సీఎం..