Site icon NTV Telugu

MLA Poaching Case: ఫాం హౌజ్ డీల్ కేసు విచారణ.. సుప్రీంలో రామచంద్ర భారతికి చుక్కెదురు

Supreme Court

Supreme Court

MLA Poaching Case:: సుప్రీంకోర్టులో ఫాం హౌస్‌ డీల్‌ కేసు విచారణలో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఫాంహౌజ్‌ డీల్‌ కేసు విచారణలో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం న్యాయస్థానం విముఖత చూపింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా… బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని పేర్కొంది.

MLA Attacked by Locals: ఏనుగుదాడిలో మహిళ మృతి.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం

తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని నిందితులు రామచంద్ర భారతి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్ విక్రమనాథ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితులు తమ రిమాండ్‌ను సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. గత నెల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగాకాంతరావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలను ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌లను పోలీసులు అదే నెల 26న అరెస్టు చేశారు.

Exit mobile version