NTV Telugu Site icon

Telangana GOVT: జీవో 46పై కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Suprem Court

Suprem Court

Telangana GOVT: రాష్ట్రంలో 5,010 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46ను సవాలు చేస్తూ దాఖలైన కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జివోను సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి వాదనలను తోసిపుచ్చి ఈ ఏడాది ఆగస్టు 28న తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ మాటూరి శ్రీకాంత్ సహా 74 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓక, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణ జనవరి 27కి వాయిదా వేసింది. బాధితుల తరఫు న్యాయవాది ఆదిత్య సోండీ.. కేసు పరిష్కారమయ్యే వరకు ఖాళీగా ఉన్న 900 పోస్టుల భర్తీని నిలిపివేయాలని వాదించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ వరకు వేచిచూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితుల తరపున వాదించిన బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆదిత్య సోండి, జి. విద్యాసాగర్, మిథున్ శశాంక్ ఉన్నారు.

Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 46 ప్రకారం కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు జీవో వల్ల ఎవరికీ నష్టం లేదని, సమానత్వం ఉందని ధర్నా చేశారు. జివో నెంబర్ 46 రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ తాజా జివో వల్ల గ్రామీణ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందన్న వాదన అర్థరహితమని పోలీసు ఆశావాహులు మండిపడ్డారు. 2018 నోటిఫికేషన్ ఆధారంగా నిబంధనలు రూపొందిస్తే అన్ని జిల్లాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల అభ్యర్థులకు సమానత్వం ఉంటుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో జీవో నెం.46ను ప్రవేశపెట్టిందని తెలిపారు.

Read also: Manipur Violence: 23 రోజుల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం .0