NTV Telugu Site icon

Supreme Court: చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. ఈ నెల 16న తీర్పు

Supreme Court

Supreme Court

Supreme Court: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.

Read Also: Chandrababu: విజయవాడ సీఐడీ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. 17Aపై తీర్పు తర్వాత ఫైబర్‌నెట్‌ కేసు విచారణ చేపడతామని.. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 16న చంద్రబాబు స్కిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు l Chandrababu l NTV