Site icon NTV Telugu

Supreme Court: కోర్ట్ ధిక్కరణ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు

Gaddam Prasad

Gaddam Prasad

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్ట్ ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కోర్ట్ ఆదేశాలను ధిక్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. ప్రధాన పిటిషన్ తో ట్యాగ్ చేసిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ధర్మాసనం ట్యాగ్ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6 కు వాయిదా వేసింది.

Exit mobile version