Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ జరపనుంది. గత విచారణ సందర్భంగా ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామని కోర్టు స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్‌లపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని కోర్టుకు తెలపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే కేసులో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. మహేశ్వర్ రెడ్డి వేసిన కేసును ప్రధాన పిటిషన్‌తో ట్యాగ్ చేసింది ధర్మాసనం. అయితే.. ఇప్పటికే మొత్తం పదిమంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లలో 8 పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిల విచారణ పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ మేరకు తీర్పు వెలువరిస్తుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
READ MORE: Nagababu : పాలు లేకుండానే నెయ్యి తీసేశారు – వైసీపీపై నాగబాబు ‘సెకండ్ ఇన్నింగ్స్’ అటాక్.
