Site icon NTV Telugu

Bilkis Bano case: నేడు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు

Bilkis Bano Case

Bilkis Bano Case

Supreme Court: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఆగస్టు 2022లో బిల్కిస్ బానో గ్యాంగ్‌ రేప్ కేసులో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. నిందితుల విడుదలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈరోజు దీనిపై నిర్ణయం ఉన్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Read Also: Railway Budget: రైల్వే మొదటి బడ్జెట్ ఎంత ? ప్రస్తుతం వందేభారత్ కు ఎంత ఖర్చవుతుందంటే ?

కాగా, బిల్కిన్ బానో కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేస్తుంది. గత ఏడాది అక్టోబర్ 12న ఈ కేసులో తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసింది. ఈ కేసుపై వరుసగా 11 రోజుల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా, కేంద్రంతో పాటు గుజరాత్ ప్రభుత్వాలు దోషులకు శిక్షను తగ్గించడానికి సంబంధించిన అసలు రికార్డులను అందించాయి.

Read Also: Postal Jobs 2024 : పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

అయితే, దోషులకు క్షమాభిక్ష నిర్ణయాన్ని గుజరాత్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. నిందితులకు ముందస్తుగా విడుదల చేయడంపై కూడా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. అయితే, శిక్షను క్యాన్సిల్ చేయడానికి ఇది వ్యతిరేకం కాదని.. అయితే నిందితుల ఉపశమనానికి ఎలా అర్హత పొందారనే విషయాన్ని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా, దోషుల్లో ఒకరి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, శిక్షల ఉపసంహరణ నిందితుడికి సమాజంలో మళ్లీ జీవించాలనే కొత్త ఆశాకిరణాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

Exit mobile version