Site icon NTV Telugu

Godhra Train Burning Case: గోద్రా రైలు దహనం కేసు… దోషులకు సుప్రీం షాక్

Godhra

Godhra

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోద్రా రైలు దహనం కేసు దోషులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. గోద్రా అల్లర్లను ‘తీవ్రమైన ఘటన’గా ధర్మాసనం పేర్కొంది. 27 ఫిబ్రవరి 2002న దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది గోద్రా రైలు దహనం ఘటన. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయలోనే ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అనేక విచారణ కమిటీలను వేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా భావించిన సౌకత్ యూసుఫ్ ఇస్మాయిల్, బిలాల్ అబ్దుల్లా ఇస్మాయిల్, సిద్దికరే జీవిత ఖైదు విధించారు. ప్రస్తుతం వారు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Also Read: Mamata Banerjee: కేంద్రంలో రాజకీయ స్థానం అవసరం లేదు… అదొక్కటే లక్ష్యమంటున్న మమతా బెనర్జీ

అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వీరు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని తీవ్రమైన ఘటనగా పేర్కొన్న సుప్రీంకోర్టు ఇది ఒక వ్యక్తివ హత్యకు సంబంధించింది కాదని, ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారని పేర్కొంది.

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ముగ్గురు రైలు దహనం కేసులో కీలక పాత్ర పోషించారని తెలిపింది. దీని కారణంగా వారికి బెయిల్ ఇవ్వడం కుదరదని వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.

Exit mobile version