Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court Cji Expressed Surprise At Erra Gangireddy Bail Issue In Ys Viveka Murder Case

YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారం.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ

Published Date :May 18, 2023 , 2:39 pm
By Sudhakar Ravula
YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారం.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్‌.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ.. బెయిల్ ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ తల పట్టుకున్నారు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణ వెకేషన్ బెంచ్ కి బదిలీ చేసింది.

Read Also: Anil Kumar Yadav: సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

ఇక, ఈ వ్యవహారంలో వచ్చేవారం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ వివేకా కూతురు వైఎస్‌ సునీతారెడ్డి.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేసింది. కాగా, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చింది.. వివేకా హత్య కేసులో జూన్ 30వ తేదీతో దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై 1న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.. అయితే, జులై 1న మళ్లీ బెయిల్ పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సుప్రీంను ఆశ్రయించారు సునీతారెడ్డి.. బెయిల్ ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన సందర్భాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తన పిటిషన్‌లో సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు సునీతారెడ్డి. కాగా, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే.. హైదరాబాద్‌ నాంపల్లిలోని లోని సీబీఐ కోర్టులో లొంగిపోగా ఆయనకు జూన్‌ 2వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది కోర్టు.. ఇక, అంతకుముందు తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటు 5వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశించింది.. ఇక, వైఎస్‌ వివేకా హత్య కేసులో 2019 మార్చి 28న పోలీసులు ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేసిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CJI
  • cji chandrachud
  • Erra Gangireddy
  • Supreme Court
  • YS Viveka case

తాజావార్తలు

  • Homemade Natural Sunscreen: ఇక ఎండకు భయపడాల్సిన అవసరం లేదు..! ఇంట్లోనే ఇలా సన్‌స్క్రీన్‌ తయారు చేసుకోవచ్చు..

  • Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

  • Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

  • Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions