NTV Telugu Site icon

CJI DY Chandrachud: ఆర్టికల్ 370పై మాట్లాడేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు సీజేఐ

Dy Chandrachud

Dy Chandrachud

Supreme Court: ఏదైనా కేసులో తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత అది దేశంతో పాటు ప్రజల ఆస్తి అవుతుందన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏకగ్రీవ తీర్పుపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయ్యేందుకు ఆయన నిరాకరించారు.

Read Also: Devara: పోస్టర్ పై ఫ్యాన్స్ అసహనం.. ఎవడ్రా చెప్పింది..?

అయితే, కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించిందని చెప్పడం సరికాదు అని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. మరింత పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకున్నాం.. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకు ఇటీవల అత్యన్నత న్యాయస్థానం నిరాకరించిన అంశంపై విమర్శల పట్ల కూడా సీజేఐ స్పందించేందుకు నిరాకరించారు. ఏ కేసులో అయినా, తీర్పు వెలువడే వరకు దాని నిర్ణయంలో పాల్గొన్న న్యాయమూర్తుల వరకే ఆ ప్రక్రియ పరిమితమై ఉంటుంది.. కానీ, న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి వచ్చి తీర్పు వెలువరించిన తర్వాత అది జాతి ఆస్తిగా పరిగణించబడుతుందన్నారు.

Read Also: Petrol and Diesel: పెట్రోలు, డీజిల్‌పై తీవ్ర చలి ప్రభావం..! తగ్గిన అమ్మకాలు

స్వేచ్ఛా, వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ హక్కులను పరిరక్షించే రాజ్యాంగం మనకు ఉంది అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు తమ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛతో విమర్శించడం, అభినందించడం వంటివి చేసేందుకు అర్హులు అని ఆయన ప్రకటించారు. మాకు సంబంధించినంత వరకు రాజ్యాంగం, చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విమర్శలకు ప్రతిస్పందించడం లేదా నా తీర్పును నేను సమర్థించడం పద్దతి కాదు.. ఏదైనా తీర్పులో మేము చెప్పింది సంతకం చేసిన తీర్పు ప్రతిలో ప్రతిబింబిస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు.