NTV Telugu Site icon

Supreme Court: ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. విచారణ వాయిదా

Bbc

Bbc

బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: మోడీ క్వశ్చన్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం 2025 జనవరికి వాయిదా వేసింది. కేంద్రం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్‌ను ఇంకా నమోదు చేయకపోవడంతో జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కేసును వచ్చే సంవత్సరానికి వాయిదా వేసింది. కాగా.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.

Read Also: Nandigam Suresh: మహిళ హత్య కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్‌!

2022 గుజరాత్ అల్లర్లకు సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ ప్రధాని మోడీని కించపరిచే విధంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ఈ సిరీస్ పై నిషేధం విధించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డాక్యుమెంటరీని “ప్రచార భాగం”గా అభివర్ణించింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వివాదాస్పద డాక్యుమెంటరీని కేంద్రం బ్లాక్ చేసింది.

Read Also: Nandigam Suresh: మహిళ హత్య కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్‌!