Site icon NTV Telugu

Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా

Chandrababu

Chandrababu

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.. హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు కోర్టుకు రాలేక పోయారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఈ కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.. అయితే, వీలయినంత త్వరగా డేట్ ఇవ్వండని కోరారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్.. ఇక, ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. దాంతో ఈ కేసును రెండు వారాలు కేసును వాయిదా వేసింది.. ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని తెలిపింది ధర్మాసనం.. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ నెల 26వ తేదీన కేసు విచారణ చేపట్టనుంది.. కాగా, ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసిన విషయం విదితమే.

Read Also: PM Modi: భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ మనకు అవసరం..

Exit mobile version