Site icon NTV Telugu

Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌కు ముస్లిం మహిళల సపోర్ట్..

Uniform Civil Code

Uniform Civil Code

యూనిఫాం సివిల్ కోడ్‌ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నది. ముస్లిం సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి పౌరస్మృతి అన్ని మతాలను ప్రభావితం చేస్తుందని వారు వాదిస్తున్నారు. కానీ, అదే ముస్లిం మహిళలు మాత్రం ఇందుకు భిన్నమైన వాణి వినిపిస్తున్నట్లు ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెజార్టీ ముస్లిం మహిళలు యూనిఫాం సివిల్ కోడ్‌కి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వ ఆస్తుల విషయంపై దాదాపు 67.2 శాతం మంది ముస్లిం మహిళలు ఈ బిల్లుకి సపోర్ట్ తెలుపుతున్నారు.

Read Also: SS Thaman: రీమేక్ సినిమాలకు సంగీతం అందించడంపై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 వేల 35 మంది ముస్లిం మహిళలను ఓ న్యూస్ ఛానెల్ సర్వే చేసింది. ఈ సర్వేలో 18 నుంచి 65 ఏళ్ల మహిళలు, భిన్నమైన కమ్యూనిటీలు, ప్రాంతాలు, విద్యార్హతలు గలవారు ఉన్నారు. వివాహితులు, అవివాహితులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి మతాలకు అతీతంగా దేశ పౌరులందరికీ యూనిఫాం సివిల్ కోడ్‌ బిల్లు వర్తిస్తుంది. ఇది పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టం.

Read Also: Disha Patani : అబ్బా..మరీ ఇంత చూపిస్తే తట్టుకోవడం చాలా కష్టం పాప..

ఉమ్మడి పౌరస్మృతిని సమర్థిస్తారా? అని అడగ్గా.. 67.2 శాతం మంది మహిళలు ఔను అని చెప్పారు. 25.4 శాతం మంది మహిళలు మాత్రం ఈ బిల్లును సమర్థించబోమని ఆన్సర్ ఇచ్చారు. ఇక, 7.4 శాతం మాత్రం ఏమీ చెప్పలేమని అన్నారు. భిన్నమైన విద్యార్హతలు గల ముస్లిం మహిళల అభిప్రాయాలు చూస్తే.. 68.4 శాతం అంటే 2,076 మంది డిగ్రీ పట్టా పొందిన మహిళలు కామన్ సివిల్ కోడ్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. అదే 27 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. వయసు రీత్యా చూసుకుంటే 18 నుంచి 44 ఏళ్ల వయసుగల మహిళలు 69.4 శాతం మంది యూసీసీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 24.2 శాతం మంది మహిళలు మాత్రం ఉమ్మడి పౌరస్మృతి తమకేమీ వద్దని చెప్పుకొచ్చారు.

Exit mobile version