Site icon NTV Telugu

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గోల్డెన్‌ వీసా!

Rajinikanth Golden Visa

Rajinikanth Golden Visa

Rajinikanth Receives UAE Golden Visa: సౌత్ ఇండియన్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే ‘గోల్డెన్‌ వీసా’ను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డీటీసీ)లో సూపర్ స్టార్ గోల్డెన్‌ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు.

వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని ప్రత్యేకంగా సత్కరించేందుకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందిస్తోంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వీసా కాలపరిమి 10 ఏళ్లు. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఇప్పటికే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ అరుదైన వీసా పొందిన అనంతరం రజనీకాంత్‌ ఆనందం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు. వీసా విధివిధానాలను నిర్వహించినందుకు లులు గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!

ఈ పర్యటన సందర్భంగా అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును రజనీకాంత్‌ సందర్శించారు. అంతేకాదు దేశంలోనే అతిపెద్దదైన బాప్స్‌ హిందూ దేవాలయంను సందర్శించారు. అంతకుముందు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. డీటీసీ చైర్మన్ యూసఫ్ అలీ నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్.. వెకేషన్ కోసం యూఏఈ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో డీటీసీ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను అందజేసింది.

Exit mobile version